Telugu ePaper logo

Sri Lanka Wins Tri Series Against India

దంబుల్లాః ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్లో భారతపై 74 పరుగుల తేడాతో శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో మైక్రోమ్యాక్స్‌ ముక్కోణపు సిరీస్‌ లంక వశమైంది.

బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు తీసింది. దిల్షాన్‌ 110 పరుగులతో సెంచరీ చేయగా కెప్టెన్‌ సంగర్కరా 71 పరుగులు తీయగా లంక భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో మునాఫ్‌ పటేల్‌, ఇశాంత్‌ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా ప్రవీణ్‌ కుమార్‌, నెహ్రా, యువరాజ్‌సింగ్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా 299 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ధోని సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కార్తిక్‌ డకౌట్‌ అవ్వగా, సెహ్వాగ్‌ 28 పరుగుల చేసి రనౌట్‌ అయ్యాడు. విరాట్‌ కోహ్లీ 37 పరుగులతో తనదైన శైలిలో ఆడగా లంక బౌలర్ల దాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కెప్టెన్‌ ధోనీ 67 పరుగులతో ఈ మ్యాచ్‌లో అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. దీంతో భారత్‌ 225 పరుగులకు అలౌటైంది. చెరో మూడు వికెట్లు తీసిన పెరారీ, రణ్‌దివ్‌లు మరో బౌలర్‌ మలింగ 2 వికెట్లు తో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు.